ఏపీలో 3 కొత్త విమానాశ్రయాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : ఏపీలో మూడు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. వీటిలో ఒకటి ఇప్పటికే ప్రారంభమైందని కేంద్ర విమానయానశాఖ మంత్రి జనరల్ వీకే. సింగ్ తెలిపారు. గురువారం లోక్ సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇప్పటి వరకు భోగాపురం, దగదర్తి, ఓర్వకల్లు విమానాశ్రయాలకు అనుమతి ఇచ్చామని, వీటిలో ఓర్వకల్లు విమనాశ్రయం 2021 మార్చిలో ప్రారంభమైందని కేంద్ర మంత్రి తెలిపారు. భోగాపురానికి 2500 కోట్లు, దగదర్తికి 293 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామని ఆయన తెలిపారు. విమానాశ్రయాలు నిర్మాణం, నిధుల సేకరణ బాధ్యత … వాటిని అభివృద్ధి చేసిన వారిదేనని జనరల్ వీకే. సింగ్ చెప్పారు.