NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం పర్యటనను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే కోట్ల

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: మార్చి 9వ తేదీన డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించనున్న నూతన పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న సందర్భంగా కొత్తబురుజు గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ ప్రాంగణాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి  పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్  రాజకుమారి గనియ , జాయింట్ కలెక్టర్ కార్తీక్ , ఎస్పీ సునీల్ శిరాన్ ,ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు తో కలిసి చర్చించి అవసరమైన సూచనలు ఎమ్మెల్యే  ఇచ్చారు.కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే  ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author