NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గోసంరక్షణతోనే దేశ పురోగమనం

1 min read

డాక్టర్ మల్లు వేంకట రెడ్డి, తితిదే

నందికొట్కూరులో ముగిసిన తితిదే ధార్మిక కార్యక్రమాలు

కర్నూలు, నందికొట్కూరు:  గోసంరక్షణతోనే దేశ పురోగమనం ఆధారపడి ఉంటుందని, దేశానికి గోవు మూలాధారమని, గో సంరక్షణతో సకలైశ్వర్యాలు సాధించవచ్చని,  తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని శ్రీ రుక్మిణి పాండురంగస్వామి దేవస్థానం నందు ధార్మిక కార్యక్రమాల ముగింపు సందర్బంగా గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. మూడురోజులపాటు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ సి. హెచ్.వి. రాజారెడ్డి శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై చేసిన ప్రవచనాలు, మల్యాల, తూడిచర్ల నుండి వెంకట రమణ, సోమన్న బృందాలు  చేసిన భజన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారమండలి సభ్యులు అంబటి శివశంకర రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బి.వెంకోజి రావు, కోశాధికారి యం. సత్యనారాయణ రావు, అర్చకులు శ్రీధర్, యం. జయగౌరి, జి. కృష్ణారావు, భవాని కుమార్, జి. నాగరాజు, ఎన్. వెంకటరావు, జి. మోహనరావు, యం. కృష్ణ, పి. రామారావు, బి.రఘునాధరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రఘు రామాచార్యులు, మాకా శేషయ్య, ఎల్. ఐ. సి. రామకృష్ణారెడ్డి, రమణ,  సాయిరాం విద్యాసంస్థల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, సుధాకర్ రెడ్డి, డాక్టర్ మోక్షేశ్వరుడు, ప్రభుత్వ కళాశాల అధ్యాపకులు లక్ష్మన్న,  శివారెడ్డి, రమేశ్ రెడ్డి, ఎన్ లక్ష్మీబాయ్, జి.నాగమణి బాయ్, ఎస్.లక్ష్మి, ఎస్.జయమ్మ,  తదితరులు పాల్గొన్నారు.

About Author