పెదపాడు శాఖ గ్రంథాలయంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు
1 min read

ఘనంగా నివాళులర్పించిన గ్రంథాలయధికారి దుగ్గిపోగు జాన్ బాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదపాడు శాఖా గ్రంథాలయం నందు నేడు తెలుగు జాతి విప్లవ కెరటం తెలుగు తల్లి ముద్దుబిడ్డ ఆంధ్ర రాష్ట్ర ఆత్మగౌరవానికి ప్రతిబింబం భాష ప్రయోక్త తెలుగు రాష్ట్రాల ఆద్యుడు అశేష తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని ముందుగా ఆయన చిత్రపటానికి గ్రంధాలయాధికారి దుగ్గిపోగు జాన్ బాబు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పెదపాడు హైస్కూల్ సోషల్ మాస్టర్ నాగరాజు ముఖ్యఅతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాల గురించి వారి ఆమరణ నిరాహార దీక్షతొ బలిదానం గురించి విపులంగా వివరించారు. పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించినారు. గ్రంధాలయ పాఠకులు సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు. పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు త్రాగునీరు అందించి స్నాక్స్ పంచి పెట్టడం జరిగినది.

