పాఠశాల రూపు రేఖలు మార్చిన మధుశావళి
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపలి మండలంలోని రామ కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల పెయింట్ లేక పేరు కూడా కనపడని అత్యంత దయనీయ పరిస్థితి లో ఉండటాన్ని చూస్తూ ప్రతిరోజూ మదన పడిపోతున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోపాలకృష్ణనాయక్ అదే గ్రామానికి చెందిన ఆర్మీ లో పనిచేస్తున్న మధుషావళి దృష్టికి సమస్యను తీసుకెళ్లగా తను వెంటనే దాదాపు 24 వేల రూపాయలను పాఠశాల కొరకు దానం చేశారు.తను చదువుకున్న పాఠశాలకు ఇవ్వడం తమకు ఎంతో సంతృప్తి గా ఉందని అన్నారు..మధుశావళిని గ్రామస్తులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు గోపాలకృష్ణ నాయక్,భార్గవి అభినందించారు.ఇక్కడ తెలుసుకోవలసిన మరో ముఖ్య విషయం ఏమనగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మొదటి నుండి యూటీఎఫ్ మండల కార్యవర్గ సభ్యుడిగా పనిచేస్తూ సామాజిక స్పృహ కలిగిన నాయకుడిగా తను పనిచేస్తున్న పాఠశాల అభివృద్ధికి, పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేస్తుండటం అభినందనీయం అని ప్రభుత్వ బడిని రక్షించుకుందాం ,ప్రభుత్వ బడిని కాపాడుకుందాం అని ఇలా మండల యూటీఎఫ్ నాయకులు కార్యకర్తలు దాతల సహకారంతో ముందుకు పోవడం అభినందనీయం అని మధుశావళి నీ మరియు పాఠశాల సిబ్బందిని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ లతీఫ్,యూటీఎఫ్ మండల నాయకులు రాజేంద్ర,అమీర్,రహీం,శేషయ్య,మదన్ గోపాల్ తదితరులు అభినందించారు.


