NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తంగేళ్ల ముడి గవరపేట ఏటిగట్టుపై శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వర్ణ దేవాలయం శంకుస్థాపన

1 min read

ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక తంగేళ్లమూడి జంగారెడ్డిగూడెం రోడ్డు 49వ డివిజన్ లో (గవరపేట ఏలూరు ఏటిగట్టు) శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వర్ణ దేవాలయం శంకుస్థాపన కార్యక్రమం బుధవారం ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఆశీస్సులతో నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారు. అయ్యప్ప స్వర్ణ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షులు పోలిశెట్టి దివాకర్ సీతారాం స్వామి మరియు బృందం చే కార్యక్రమం కన్నులు పండుగ నిర్వహించారు. 365 రోజులు మాల సంపూర్ణం, పంచభూతాల సాక్షిగా ప్రతి భక్తుడు ఐదు రూపాయలు విరాళాలు ఇచ్చి శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వర్ణ దేవాలయం నిర్మాణానికి సహకరించాలని కోరారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్థానికలు, భక్తులు, శ్రేయోభిలాషులు,విచ్చేసి స్వామివారి ఆశీస్సులు అందుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

About Author