పోలీసు వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి
1 min read

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: నేర నియంత్రణలో సాంకేతికతను ఆయుధంగా మలచు కోవాలి అని ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ వారు సోమవారం నాడు ఒక్క రోజు వర్క్ షాప్ ను ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయము లో ఉన్న హచ్ జె దొర సమావేశ మందిరంలో నిర్వహించినారు.పోలీసు వ్యవస్థలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ గారు పిలుపు నిచ్చారు. ఏలూరు జిల్లాలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్లు రైటర్లు మరియు ఈ-కాప్ కానిస్టేబుళ్లకు ఆధునిక సాంకేతికత, కొత్త చట్టాలు మరియు రోడ్డు ప్రమాద బాధి తుల సహాయం పై ఒక రోజు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు.వర్క్ షాప్ లోని ప్రధానాంశాలు రోడ్డు ప్రమాద బాధితులకు PM RAHAT & గుడ్ సమారిటన్’ యాక్ట్కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పీఎం రహట్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ లో అందే నగదు రహిత చికిత్స పై సిబ్బందికి అవగా హన కల్పించారు.ప్రమాద బాధితు లను కాపాడే గుడ్ సమారిటన్ మంచి మనసుతో స్పందించే వారు కు ఉండే చట్టపరమైన రక్షణ గురించి ప్రజలకు వివరించాలని ఎస్పీ సూచించారు.ఆధునిక సాంకేతికత నేర నియంత్రణ మిస్సింగ్ చైల్డ్ & అన్-ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్, తప్పి పోయిన పిల్లలను గుర్తించడంలో మరియు గుర్తుతెలియని మృతదేహాల వివరా లను సేకరించడంలో అత్యాధునిక సాఫ్ట్ వేర్లను ఎలా వినియో గించలో శిక్షణ ఇచ్చా రు.నేరస్థుల పై నిఘా నేరాలు జరగకుండా ముందస్తుగా నిరోధిం చడానికి, నేరస్థుల కదలికలను సాంకేతికత ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈ విషయాలను గురించి అన్ని పోలీస్ స్టేషన్ లు ఉన్న సిబ్బం దికి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం, ఈ వర్క్ షాప్ లో భాగంగా ఎస్పీ వీడియో కాన్ఫ రెన్స్ ద్వారా జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రతి కానిస్టేబుల్ సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించి, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ ,ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్,జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.


