శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని గుడిపాడు గ్రామంలో మహత్తరంగా నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి హాజరై హోమం పూజలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ వాల్మీకి మహర్షి విగ్రహం దారికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి, వాల్మీకి మహర్షిని ఆయన దర్శించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి ఆధ్యాత్మికత, సమానత్వం, మానవ విలువలను సమాజానికి పరిచయం చేసిన మహనీయులు అని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నేత లక్కసాగరం లక్ష్మి రెడ్డి, తెదేపా మండల ఇన్చార్జి ఎద్దుల దొడ్డి ప్రభాకర్ రెడ్డి, తెదేపా సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్, బత్తుల రమేష్ రెడ్డి,వలిసల రామకృష్ణ,ఎపి శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ కుమ్మరి సుధాకర్, మండల కన్వీనర్ సుదర్శన్,గుడిపాడు వాల్మీకి సోదరులు ఓబులేసు, చిన్న మద్దయ్య,గోరేంట్ల,చౌడప్ప,చంద్ర, మాజీ సర్పంచ్ గొవింద్,జక్కల రవి, తదితరులు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


