NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కూటమి ప్రభుత్వంలో  అభివృద్ధికి పెద్దపీట

1 min read

టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ

కర్నూలు, న్యూస్ ​నేడు: కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పేర్కొన్నారు.వారు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

స్థానిక సంస్థలకు ఆర్థిక బలోపేతం

స్థానిక సంస్థల అభివృద్ధి కోసం 16వ ఆర్థిక సంఘం ద్వారా రూ.12,600 కోట్ల నిధులు కేటాయించినట్లు వివరించారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు వినియోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

రైతులకు అండగా కూటమి ప్రభుత్వం

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, పంటలకు గిట్టుబాటు ధరలు, సాగునీటి సదుపాయాలు, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పంటల నష్టాన్ని అంచనా వేసి అర్హులైన రైతులకు పరిహారం అందించే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

మహిళా సాధికారతకు ప్రాధాన్యత

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మహిళల అభివృద్ధి ద్వారానే కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సాహం

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంతో పాటు బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. బీసీ రక్షణ చట్టం-2026 ప్రస్తావిస్తూ, బీసీల హక్కులు, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని వివరించారు.

పేదలకు ఇళ్లు, మౌలిక వసతులు

పేదలకు గృహ నిర్మాణం, రహదారుల అభివృద్ధి, తాగునీటి సదుపాయాలు, పట్టణాల మౌలిక వసతుల మెరుగుదలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గృహ నిర్మాణ కార్యక్రమాలు, రహదారుల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణం ద్వారా ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

పట్టణాభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ

అమృత్ 2.0, ఇతర పట్టణాభివృద్ధి పథకాల ద్వారా పట్టణాల్లో మౌలిక సదుపాయాలు, రహదారులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.చివరిగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, సంక్షేమ పథకాల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల వేగవంతం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పాలన సాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *