NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు రిడ్జ్ విద్యార్థి ఎంపిక

1 min read

కర్నూలు, లక్ష్మీపురం   న్యూస్​ నేడు : రిడ్జ్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి కే. నిశాంత్ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యాడు. అక్టోబర్ 10 నుంచి 12 వరకు తిరుపతి జిల్లాలోని విక్రమ్ టెన్నిస్ అకాడమీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ టెన్నిస్ పోటీలు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 5 వరకు ఢిల్లీలో నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో సీఈఓ జి. గోపీనాథ్  మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయస్థాయిలో పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. నిశాంత్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు, కర్నూలు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు.కో-సీఈఓ జి. సౌమ్య గోపీనాథ్  మాట్లాడుతూ, నిశాంత్ జాతీయస్థాయి పోటీల్లోనూ తన ప్రతిభను చాటి విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపాల్ ఏ. రాజకమల్  , హెచ్‌ఓడీలు ఏ. నాగేంద్ర, ఎస్. శ్రీనివాసులు తదితరులు పాల్గొని నిశాంత్‌ను అభినందించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *