విద్యుత్ వినియోగం పై ‘స్విచ్ ఆఫ్ అవర్’ కు పిలుపు..
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డా కె వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న బ్రిక్స్ సస్టైనబుల్ లైఫ్‌స్టైల్ వీక్ (BRICS Sustainable Lifestyle Week) కార్యక్రమాల్లో భాగంగా 02-11-2026 న విద్యుత్ పొదుపు (Save Energy) దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని కార్యాలయ సిబ్బంది మరియు ఇతర అధికారులు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, విద్యుత్‌ను వృథా చేయకుండా విద్యుత్ వినియోగం తగ్గించారు.కార్యక్రమంలో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు ‘స్విచ్ ఆఫ్ అవర్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమయంలో అవసరం లేని లైట్లు, ఫ్యాన్లు, కార్యాలయ విద్యుత్ పరికరాలు మరియు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫ్ చేయాలని సూచించారు. అలాగే సాధ్యమైనంత వరకు సహజ కాంతిని వినియోగించుకోవాలని, అవసరం ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ పరికరాలను ఉపయోగించాలని అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీనివాసులు గారు మాట్లాడుతూ విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యుత్‌ను ఆదా చేయడం ద్వారా సహజ వనరులను సంరక్షించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడవచ్చని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో విద్యుత్ పొదుపు అలవాట్లను పాటిస్తూ పర్యావరణ హితమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాన్ని కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీ ఎం. అబ్దుల్ లతీఫ్ బేగ్ పర్యవేక్షణలో నిర్వహించారు.


