ఊపందుకున్న ఎంపిటీసీ అభ్యర్థి హుస్సేన్ భాష ప్రచారం
1 min read
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన మాసపేట ఎంపిటిసి అభ్యర్థి దూదేకుల హుసేన్ భాష ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. సోమవారం సాయంత్రం సంపంగి రవీంద్రబాబు, ఎంపిటిసి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ మిడుతూరు మండల క్లస్టర్ ఇన్చార్జి కమతం రాజశేఖర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం పథకాలు ప్రజల వద్దకు చేర్చందని రానున్న రోజుల్లో గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని దయవుంచి మంచి మనసుతో రెండు ఓట్లను తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటేయాలని వారు ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో రమణారెడ్డి, సాహెబ్,వంగూరు వెంకటరెడ్డి,వి పెద్ద వెంకటరామిరెడ్డి,పల్లె వేణుగోపాల్ రెడ్డి,చెన్నూరు వేణుగోపాల్ రెడ్డి,డి జయరాముడు,రఘునాథ రెడ్డి,ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు.


