NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలతో మమేక మవుతూ ప్రచారం  చేస్తున్న మూడే ప్రశాంత్ నాయక్

1 min read

తంబళ్లపల్లి జడ్పీటీసీ అభ్యర్థి గ్రామా ల్లో విస్తృత పర్యటన

తనకు మద్దతు  ఇవ్వాలని ప్రజలకు అభ్యర్థన

మదనపల్లె , న్యూస్ నేడు ప్రతినిధి :తంబళ్లపల్లి మండలంలో తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ఎన్నికల ప్రచారాన్ని విస్తృతం చేశారు. సోమవారం మండలంలోని పలు పంచాయతీల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసు కున్నారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్య క్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివ రించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరపత్రాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనపై తన ప్రాధాన్యతలను ప్రజలకు తెలియ జేశారు. ప్రజలతో మమేకమవుతూ సాగుతున్న ప్రచారం లో మూడే ప్రశాంత్ నాయక్ మాట్లా డుతూ తన తండ్రి మూడే గోపాల్ నాయక్ తెలుగు దేశం పార్టీలో కొన సాగుతూ ప్రజల్లో గుర్తింపు పొందారని తెలిపారు. ఆయన స్ఫూర్తితోనే ప్రజా సేవ చేయాలనే సంకల్పంతో రాజ కీయాల్లోకి వచ్చాన న్నారు.తంబళ్లపల్లి టీడీపీ ఇన్‌చార్జి జి. శంకర్ యాదవ్ చొరవతో కూటమి తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం లభించడం సంతో షంగా ఉందన్నారు. ప్రజల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తే మండల అభివృద్ధికి అంకిత భావంతో పని చేస్తానని పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు మరింత చేరువయ్యేలా కృషి చేయడమే కాకుండా జిల్లా పరిషత్ నిధులను సాధించి గ్రామాల్లో మౌలిక వస్తువులు కల్పనకు ప్రాధా న్యత ఇస్తామ న్నారు. శంకర్ యాదవ్ సహకారం తో మండలంలో మౌలిక సదు పాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తంబళ్లపల్లి నియోజకవర్గ అభివృద్ధికి శంకర్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజా సేవకు అంకిత మవుతానని ఇందుకు ప్రజల అశీసులు కావాలని కోరారు. ఈ కార్య క్రమంలో కూటమి నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *