స్వచ్ఛ యం.డి. హళ్లి గ్రామమే నా లక్ష్యం
1 min read

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలంలోని యం.డి. హళ్లి గ్రామంలో సర్పంచ్ జి. సుధాకర్ ఆధ్వర్యంలో శర వేగంగా పరిశుధ్య పనులు జరుగుతున్నాయి. గ్రామంలోని ఎస్సీ, బీసీ, ఓసి కాలనీ లలో డ్రైనేజిలు తీయించి, బ్లీచింగ్ పౌడర్ వేయించడం జరిగింది. గ్రామంలో రోడ్డు పక్కన దిబ్బలను జేసిబి ద్వారా తొలగించి గ్రామం అంత పరిశుధ్యమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని సర్పంచ్ సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో పంచాయితీ సెక్రటరీ రాజకుమార్ గ్రామస్థులు పాల్గొన్నారు.

