ఆలూరు టిడిపి ఇంచార్జి వైకుంఠం జ్యోతి అభివృద్ధియే అన్నిటికి సమాధానం
1 min read

హోళగుంద న్యూస్ నేడు : హొళగుంద మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పత్రిక సమావేశంలో టిడిపి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గ ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టిన అతిస్వల్ప కాలంలోనే వైకుంఠ జ్యోతి కొత్త,పాత తరం నాయకులు మరియు కార్యకర్తలు అందరిని సమిష్టిగా కలుపుకుపోతూ ఇంచార్జిగా నియమితులైన కేవలం రెండు నెలల వ్యవధిలోనే సిసి రోడ్లు, అంగన్వాడీ భవనాలు, పాఠశాల భవనాల నిర్మాణం, తాగునీటి పైప్ లైన్ల ఏర్పాటు తదితర అభివృద్ధి పనుల్లో శరవేగంగా దూసుకుపోతున్నారని, ఇందుకుగాను కూటమినేతలు జనసేన బిజెపి నాయకులు కూడా తమవంతుగా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ముందుకు సాగుతున్నారన్నారు.అయితే అభివృద్ధిని చూసి ఓర్వలేని తనమే అసూయక మూల కారణమని, వెనుకబడిన ఆలూరు నియోజకవర్గాన్ని సమిష్టిగా అభివృద్ధి పరుచుకోవడం మానేసి, చెప్పుడు మాటలు విని తప్పుడు రాతలు రాస్తూ, ప్రజాస్వామ్యానికి అసలైన పునాది అయినటువంటి పత్రిక విలేకరిగా తనవంతు సామాజిక బాధ్యతను విస్మరించి అభివృద్ధి సాధకులపై బురజల్లడాన్ని తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు కార్యకర్తలు ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.మైనారిటీ నాయకులు ఆదం మాట్లాడుతూ పత్రిక ప్రచురణలో వాస్తవాలను తెలుసుకొని రాయాలని, వైకుంఠం జ్యోతి ఆలూరు టిడిపి ఇంచార్జివర్యులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుండి ఆలూరు నియోజకవర్గంలోని గ్రామ గ్రామాన కూడా కూటమి నాయకుల్లో నూతన ఉత్సాహం ఉప్పొంగుతుందని తెలియజేశారు. జనసేన మండల కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ పత్రికా ముసుగులో రాజకీయ పెత్తనం చెల్లుబాటు కాదని, రాజకీయంపై అంత మక్కువ ఉంటే పత్రిక విలేకరిగా రాజీనామా చేసి తనకు నచ్చిన పార్టీలో చేరాలని అంతేకానీ ఆలూరు అభివృద్ధిని చూసి మింగుడు పడకుండా, ఇటువంటి అవాస్తవాలను, అబద్దాలను వక్రీకరించి అభివృద్ధికి చిరునామాగా నిలుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంపై అబద్ధపు రాతలు రాస్తే జనసేన కార్యకర్తలు కూడా ఉపేక్షించేది లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ కన్వీనర్, సింగిల్ విండో డైరెక్టర్ కోనేరు దుర్గయ్య, వైకుంఠం యువసేన ల్యాబ్ గిరి, బూత్ ఇంచార్జి వలిబాష ఐ-టీడీపీ తాలూకా కార్యనిర్వాహక కార్యదర్శి ఖాదర్ బాషా, కోగిలతోట సలీం,మైనార్టీ అధ్యక్షుడు మోయిన్, కార్యదర్శి కూడ్లుర్ సుభాన్,బూత్ ఇంచార్జిలు శాలి అమాన్, తాహెర్, సీనియర్ నాయకులు బుడగజంగాల రామాంజీ, దళిత నాయకులు సినిమా మంగయ్య, యూనిట్ ఇంచార్జీలు రారవి సిద్దప్ప, ఐకల్ మల్లికార్జున, తిక్కస్వామి, నాయకులు మేదేహాల్ హుస్సేన్ పీరా,సూరన్న, మరియు జనసేన వెంకటేష్ తదితర కూటమి నాయకులు కార్యకర్తలు వివిధ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

