ఫర్టిలైజర్స్ షాపులను ఆకస్మిక తనిఖీ
1 min read

హోళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం లోని న్యూ ఇరలింగేశ్వర ఫర్టిలైజర్స్, అమరేశ్వర ఫర్టిలైజర్స్, కిసాన్ మాల్ , ప్రసన్న ఆంజనేయ ఫర్టిలైజర్స్ షాపులను మండల వ్యవసాయ అధికారి ఆనంద్ లోకదళ్ వారు తనిఖీ చేయడం జరిగింది. పై ఎరువుల దుకాణాలలోని రిజిస్టర్లను, స్టాకు బోర్డులను, అనుమతి పత్రాలను తనిఖీ చేయడం జరిగింది. యూరియా మరియు ఇతర ఎరువులు అవసరమైన రైతులకు ఎంఆర్పి ధరలకు మించకుండా విక్రయించాలని ఆదేశించడం జరిగింది. ఎరువులను కృత్రిమ కొరత సృష్టిస్తే అటువంటి డీలర్లపై చర్యలు తీసుకోవటం జరుగుతుంది యూరియా ఎరువులను ఈపిఓఎస్ మిషన్ల ద్వారా రైతు ఆధార్ అనుసందానంతో విక్రయించాలని ఆదేశించారు. హోళగుంద మండలంలోని రైతులకు పంట సాగు విస్తీర్ణానికి తగ్గట్టుగా తగినంత యూరియా నిల్వలు తేపించడం జరుగుతూంది అని తేలిపారు. కాబట్టి రైతులు మీ ఆర్ఎస్కే సిబ్బందిని సంప్రదించి యూరియా కోసం పేర్లు నమోదు చేసుకోవాలి. ఆనంద్ లోక్ దళ్ కోరారు.


