NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా అభియాన్ ప్రశిక్షణ కార్యక్రమం

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ ప్రశిక్షిణ కార్యక్రమం ప్యాపిలి మండలంలో మండల అధ్యక్షులు కే. బి.దామోదర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు.పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమంను ప్రశిక్షణవక్త జిల్లా కన్వీనర్ నిమ్మకాయల సుధాకర్, మండల అధ్యక్షులు కే. బి. దామోదర్ నాయుడు, ప్రశిక్షణ వక్తకులు రవికుమార్, గోపాలకృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు సందు వెంకట రమణ మరియు బీజేపీ యువమోర్చ నాయకులు కొట్టె మల్లికార్జున విజయభాస్కర్, అరుణ్ కుమార్  జ్యోతి ప్రజ్వలనతో   ప్రారంభించారు. ప్రశిక్షణలో భాగంగా హాజరైన బిజెపి నాయకులకు,కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను గోపాల కృష్ణ మూర్తి, బిజెపి చరిత్ర ఆవిర్భావం  గురించి రవికుమార్,కార్య విస్తరణ,పోలింగ్ బూత్ మేనేజ్మెంట్ అంశాలపై  ప్రశిక్షణ జిల్లా కో కన్వీనర్ నిమ్మకాయల సుధాకర్ మరియు సోషల్ మీడియా గురించి బిజెపి యువ మోర్చ నాయకులు కొట్టె మల్లికార్జున, సరల్ ఆప్ ఐటీ అంశాలపై  జిల్లా ఐటీ కన్వీనర్ వీరేశ్ బిజెపి కార్యకర్తలకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్యాపిలి మండల నాయకులు కేసి మద్దిలేటి, శివకేశవులు, గణేష్, ఆర్మీ రామయ్య, లక్ష్మీనారాయణ, శివ, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author