NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దరఖాస్తులు రీ ఓపెన్ కాకుండా  నాణ్యమైన పరిష్కారం చూపాలి

1 min read

ధరఖాస్తులు పరిష్కారంలో అలసత్వం,నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

సోమవారం పిజిఆర్ యస్ లో అందిన అర్జీలు 358

జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి 

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ,  ఇంచార్జ్   జిల్లా రెవెన్యూ అధికారి భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటి, సర్వే శాఖ ఏడి అన్సారీ, తదితరులు  స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ  పిజిఆర్ యస్  లో అందిన ప్రతి అర్జీ ని  పరిశీలించి, వాటిలో తెలియజేసిన విషయాలపై క్షేత్రస్థాయిలో విచారణ చేసి, నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు.పిజిఆర్ యస్ లో అందిన ప్రతి అర్జీ రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం పిజిఆర్ యస్ లో అందిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని, కావున అధికారులు    క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలకు క్షేత్రస్థాయిలోనే  పరిష్కారం చేసి అర్జీలు రీఓపెన్‌కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు.  భూ సమస్యలు రెవిన్యూ క్లినిక్ ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు.సోమవారం పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందిన అర్జీలు 358పిజిఆర్ఎస్ కార్యక్రమంలో అందిన దరఖాస్తులో కొన్ని.కామవరపుకోట మండలం జలపావారిగూడెం నకు చెందిన బాడిపట్ల సుబ్బమ్మ తన దరఖాస్తులో నా కుమారుడుకి నా భూమి ని ఇచ్చానని, తన భూమిని తీసుకుని తన పోషణ చూడడంలేదని, కొడుకు, కోడలు తనపై దౌర్జన్యం చేస్తున్నారని  వాపోయింది. తనకు న్యాయం చేయాలనీ కోరగా,వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారుజిల్లాలోని వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్లు,రెవిన్యూ అధికారులు,ప్రభృతులు పాల్గొన్నారు.

About Author