మిడుతూర్ మండల పరిషత్ లో ఘన సన్మానం..
1 min read
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవ కార్యక్రమాన్ని మిడుతూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ పి దశరథ రామయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లామిడుతూరు ఎంపీడీవో కార్యాలయంలో గురువారం సా 4 గంటలకు జాతిపిత మహాత్మా గాంధీజీ మరియు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు ఎంపీడీవో,వైస్ ఎంపీపీ టి.నబి రసూల్,ఈఓఆర్డి సంజన్న, ఎంపీటీసీ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామని ఎంపీడీవో అన్నారు.అధికారులను మరియు ప్రజా ప్రతినిధులను పంచాయతీ కార్యదర్శులు సన్మానించారు.ఈ కార్యక్రమంలో మిడుతూరు ఎంపీటీసీ దేవమ్మ,ఏఓ సురేష్ కుమార్,పంచాయతీ కార్యదర్శులు శ్రీధర్,గోవింద్, గోపీనాథ్,షేక్షావలి,వీరారెడ్డి, షఫీ,సుగుణావతి,వి వినయ్ చంద్ర,ఎన్ అనురాధ తదితరులు పాల్గొన్నారు.