NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలలో వైసిపి ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైంది

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజలలో వైసీపీ ప్రభుత్వం పై తిరుగుబాటు మొదలైందని టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గిత్త జయసూర్య అన్నారు.నందికొట్కూరు నియోజకవర్గములోని ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీని చేరువ చేయడమే లక్ష్యంగా  నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న  భవిష్యత్ కు గ్యారంటీ  కార్యక్రమం లో భాగంగా కొత్తపల్లి  మండలం పాత మాడుగుల  గ్రామంలో శనివారం  తెలుగుదేశం పార్టీ నాయకులతో కలసి వెళ్లి తెలుగుదేశం పార్టీ విధి విధానాలు వివరిస్తూ , టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి తెలియజేసే కరపత్రాన్ని అందజేసి టీడీపీని ఆశీర్వదించమని కోరారు. భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం – కొత్తపల్లి మండలం,పాతమాడుగుల గ్రామం. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, క్లస్టర్ లింగస్వామి గౌడ్, శీలం లింగన్న,వెంకటస్వామి,పరమేశ్వర రెడ్డి,సుధాకర్ , గడ్డం వెంకటేష్ , శ్రీను,గుంపుల తిక్కస్వామి,యూనిట్ ఇంచార్జ్ రహీంఖాన్ , కోట్ల జీహెర్ ,మన్సూర్ బాషా,ఇక్బాల్ ,సున్నంపల్లె శ్రీనివాసులు ,కరువ వెంకటేశ్వర్లు పాలబాబు తదితరులు పాల్గొన్నారు.

About Author