జగనన్న ఆరోగ్య సురక్ష కు విశేష స్పందన
1 min read– కార్యక్రమాన్ని ప్రారంభించిన సీకేదిన్నే జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి
– 500 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని సి కె దీన్నే జడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి అన్నారు, శనివారం ఆయన మండలంలోని గ్రామపంచాయతీలో సర్పంచ్ తుంగ చంద్రశేఖర యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు, కొండపేట గ్రామపంచాయతీలో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలిరావడం, వీరికి డాక్టర్ బి చెన్నారెడ్డి నేతృత్వంలో డాక్టర్ల బృందం వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలిపారు, అంతేకాకుండా ఆరు మందికి ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు అందించేందుకు ఇతర ఆసుపత్రులకు పంపించడం జరిగింది అన్నారు, అలాగే 65 మంది కి కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మారుమూల ప్రాంతాల లో నివసించే ప్రజలకు కూడా వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు, సామాన్య ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు చేసి వైద్య పరీక్షలు నిర్వహించుకో లేరని అలాంటి వారి కొరకు ఇలాంటి కార్యక్రమాలుఎంతోఉపయోగపడతాయని ఆయన తెలియజేశారు, గతంలో ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలో లేదని, కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం హర్షించదగ్గ విషయం అన్నారు, నడవలేని వారికి, చూపు లేని వారికి, ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో సతమతమయ్యే వారికి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం గొప్ప ఊరట ను ఇవ్వడం జరిగిందన్నారు, ప్రజలు ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు, అనంతరం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పౌష్టికాహారస్థాళ్లను ఆయన పరిశీలించి వారిని అభినందించారు, ఐసిడిఎస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికా సిహెచ్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీలు దుంప నాగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, పీసీ కేశవరెడ్డి, శ్రీనివాసరాజు, శ్రీనివాసులు రెడ్డి( మాజీ డీలర్) డలాయి కిరణ్, అధికారులు తాసిల్దార్ పటాన్ అలీ ఖాన్, ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, ఏపిఎం గంగాధర్, కార్యదర్శి సుబ్రహ్మణ్యం, సర్పంచులు, ఎంపీటీసీలు, వైద్య సిబ్బంది, వాలంటీర్లు, గృహసారథులు, సచివాలయ సిబ్బంది, సచివాలయ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.