NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ పట్టణంలో టిడిపి విజయోత్సవ ర్యాలీ 

1 min read

పత్తికొండ, న్యూస్​ నేడు:  పత్తికొండ పట్టణంలో కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి ఏడాది పూర్తయిన సందర్భంగా పట్టణంలో గురువారం టిడిపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక టిడిపి కార్యాలయం నుండి నాలుగు స్తంభాల సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కే సాంబశివారెడ్డి, నాగేంద్ర, మాట్లాడుతూ, టిడిపికి బలమైన కేడర్‌, కార్యకర్తల కృషి వల్లేగత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా టీడీపీ కార్యకర్తలను పలు రకాలుగా ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పార్టీని వీడకుండా అన్నివర్గాల వారిని వేధిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని కూల్చారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే సూపర్ సిక్స్ పథకాలను 80 శాతం అమలు చేశామన్నారు. రెండువేల పెన్షన్ ను నాలుగు వేలకు పెంచామని అలాగే సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశామన్నారు. ఈరోజే తల్లికి వందనం పథకాన్ని విడుదల  చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు  పథకాన్ని అందజేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ది అన్నారు. ఈనెల 21వ తేదీన అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు అందజేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు నెలలో ప్రవేశపెట్టి నూరు శాతం హామీలను అమలు చేస్తామన్నారు. సూపర్ సిక్స్ పథకాలతో పాటు అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం దూసుకుపోతుందన్నారు. అభివృద్ధి సంక్షేమం తో రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటే వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ నాయకులు, జిల్లా కమిటీ నాయకులు, నియోజకవర్గ కమిటీ నాయకులు, మండల కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు.

About Author