NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రాలయం లో మంత్రి  నారా లోకేష్ కు ఘన స్వాగతం

1 min read

కర్నూలు/మంత్రాలయం న్యూస్ నేడు : మంత్రాలయంలో  రాష్ర్ట మానవ వనరుల అభివృద్ధి,ఐటి,ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్,ఆర్టీజీ శాఖా మంత్రి వర్యులు  నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది.శనివారం విజయవాడ నుండి మంత్రి లోకేష్  మంత్రాలయం స్కూల్ గ్రౌండ్ కు ఉదయం 9.35 గంటలకు  చేరుకున్నారు..ఈ సందర్భంగా  అధికారులు, ఎంపీ, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు,  పెద్ద సంఖ్యలో కార్యకర్తలు,ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.మంత్రి లోకేష్ కు స్వాగతం పలికిన  వారిలోజిల్లా కలెక్టర్  పి.రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి,కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మంత్రాలయం టీడీపీ ఇంఛార్జ్ ఎన్.రాఘవేంద్ర రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు.   శ్రీ రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం 12.57 గంటలకు మంత్రి విజయవాడ బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు మంత్రికి ఘనంగా వీడ్కోలు పలికారు.

About Author