సమగ్ర శిక్షా ఉద్యోగుల మహా పాదయాత్రకు హోలగుందలో ముందస్తు నోటీసు
1 min read
సమస్యల పరిష్కారానికి మే 15న విజయవాడలో మహా ఉద్యమం
రెగ్యులరైజేషన్ సహా 10 ప్రధాన డిమాండ్లతో సమగ్ర శిక్షా ఉద్యోగుల పాదయాత్ర
హామీలు అమలు చేయాలంటూ కుటుంబాలతో కలిసి మహా పాదయాత్ర
సమాన పనికి సమాన వేతనం కోరుతూ ఉద్యోగుల ఆందోళన
హోళగుందన్యూస్ నేడు: ఎ.పి. సమగ్ర శిక్షా కాంట్రాక్టు & ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్హోళగుంద మండల సమగ్ర శిక్షా కాంట్రాక్టు & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మే 15, 2026న నిర్వహించనున్న మహా పాదయాత్రకు సంబంధించి హోళగుంద మండల విద్యాశాఖ అధికారులకు ముందస్తు నోటీసు అందజేశారు.ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ, మే 15న ఉదయం 8 గంటలకు విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నుండి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నివాసం వరకు కుటుంబ సభ్యులతో కలిసి మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు.సమగ్ర శిక్షా, కేజీబీవీ, కాంట్రాక్టు మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం ఇప్పటివరకు పరిష్కరించకపోవడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మహా పాదయాత్ర ద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు.ప్రధాన డిమాండ్లు: • సమగ్ర శిక్షా, కేజీబీవీ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.
హెల్త్ పాలసీ అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. మినిమం టైమ్ స్కేల్, DA, HRA అమలు చేయాలి. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలి గ్రాట్యుటీ, EPF, ESI అమలు చేయాలి. పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ మంజూరు చేయాలి. ఎక్స్‌గ్రేషియా ₹20 లక్షలకు పెంచి కారుణ్య నియామకాలు చేపట్టాలి. మహిళలకు చైల్డ్ కేర్ లీవులు మంజూరు చేయాలి.ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా కాంట్రాక్టు & ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, నాయకులు పాల్గొన్నారు.

