NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సెప్టెంబర్ 20,21 తేదీలలో ఆలపాటి రామచందర్రావు శతజయంతి ఉత్సవాలు

1 min read

స్థానిక వై ఎం హెచ్ ఏ హాల్లో కార్యక్రమాలు

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  :అంబికా సంస్థలు,హిందూ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబికా సంస్థల వ్యవస్థాపకులు దివ్యశ్రీ ఆలపాటి రామచంద్రరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 20,21 తేదీల్లో ఏలూరు వై యం హెచ్ ఎ హాలులో ఆలపాటి రామచంద్రరావు సాహిత్య సంగీత మహోత్సవాలు రెండు రోజులు పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు  గురువారం స్థానిక వై ఎమ్ హెచ్ ఏ హాలులో నిర్వహించిన సమావేశంలో అంబికా సంస్థల చైర్మన్ అంబికా కృష్ణ, వైఎంహెచ్ఏ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు యర్రా సోమలింగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి కే.వీ సత్యనారాయణ, కార్యక్రమాలపై ప్రసంగించారు. ఉపాధ్యక్షులు ఎం.వి.ఎస్ నాగేశ్వరరావు,వేమా కోటేశ్వరరావు కోశాధికారి  కానాల బాల వెంకట రమేష్, కార్యనిర్వాహక కమిటీ అధ్యక్షులు యిరదల ముద్దుకృష్ణ కార్యనిర్వావాహక కమిటీ ఉపాధ్యక్షులు ఎల్ వెంకటేశ్వర రావు (ఎల్ వి ఆర్) తెలియజేశారు. అంబికా కృష్ణ మాట్లాడుతూ అంబికా సంస్థల ఖ్యాతిని ఏలూరు నుంచి ప్రపంచానికి విస్తరించిన ఆలపాటి రామచంద్ర శత జయంతి ఉత్సవాలు కళ,సాంస్కృతిక రంగాలను ప్రోత్సహించడంలో భాగంగా స్థానిక వై ఎమ్ హెచ్  ఏ హాల్లో 20వ తేదీన ప్రముఖ సాహిత్య  కళాకారులు పాల్గొంటారన్నారు.

About Author