NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చలో మెడికల్ కాలేజ్- ఆదోని ప్రజాల గళం

1 min read

వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఛలో ఆదోని మెడికల్ కాలేజీ కార్యక్రమం

భారీగా తరలివచ్చిన విద్యార్థులు, యువకులు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్

సీఎం చంద్రబాబు కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు

ఆలూరు న్యూస్ నేడు:  రాష్ట్ర వైస్సార్సీపీ యువజన విభాగ  సెక్రెటరీ, యువ నేత బుసినే చంద్రశేఖర్  ఆధ్వర్యంలో ఆలూరు నుండి భారీ బైక్ ర్యాలీ తో ఆదోని మెడికల్ కాలేజ్ నిరసన కార్యక్రమం విజయవంతంవైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదోనిలో బైచికేరిమరియు ఆరెకల్ వద్ద నిర్మాణ దశలో ఉన్న మెడికల్ కాలేజ్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగంల ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంకు రాష్ట్ర యువజన విభాగం సెక్రెటరీ, యువనేత బుసినే చంద్రశేఖర్  మాట్లాడుతూ… వైఎస్ఆర్సిపి పార్టీ  అధికారంలో ఉన్నప్పుడు  పేదల విద్యార్థులకు మంచి జరిగే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించారు. కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండే మెడికల్ కాలేజీలకు పిపిపి విధానాన్ని తెచ్చారు, పిపిపి విధానం ద్వారా నిరుపేద విద్యార్థులకు మంచి జరగాదు అని తెలిసి ఈరోజు మెడికల్ కాలేజ్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నామని అన్నారు.పిపిపి విధానం కూటమి నాయకుల బినాములకు మేలు జరుగుతుందే తప్ప  పేదలకు న్యాయం జరగదు. ప్రజలకు మేలు చేసింది మాత్రం  మా నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు చేయలేదుపిపిపి విధానాన్ని రద్దు చేసేంతవరకు  మేము పోరాడుతూనే ఉంటాం అని తెలిపారు .. రాష్ట్ర యువజన విభాగం సెక్రెటరీ, యువనేత బుసినే చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి , రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజయ మనోహరి , ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుక , పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి  రాష్ట్ర యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్ బుట్టా ప్రతుల్ , కర్నూల్ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు శివారెడ్డి , కర్నూల్ జిల్లా స్టూడెంట్ అధ్యక్షుడు ప్రశాంత్ ,వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గం కార్యవర్గ సభ్యులు, మండల కార్యవర్గ సభ్యులు,వైస్ ఎంపీపీ లు ఎంపీటీసీ లు, కో కన్వీనర్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్​ అభిమానులు పాల్గొన్నారు.

About Author