గీతకులాల బార్ల ను లాటరీ ద్వారా కేటాయింపు..
1 min read

నూతన బార్ పాలసీ2025-28 ప్రభుత్వం కేటాయించిన(18) ఓపెన్ బార్ కేటగిరి బార్లు
జంగారెడ్డిగూడెం పంచాయతీలో గౌడ కులానికి, ఏలూరు మున్సిపాలిటీలో శెట్టిబలిజ కులానికి బార్లు
లాటరీ ద్వారా కేటాయింపు జిల్లా కలెక్టర్ కె.వెట్రీసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నూతన బార్ పాలసీ 2025-28 భాగంగా ప్రభుత్వం వారు కేటాయించిన (18) ఓపెన్ కేటగిరి బార్లు మరియు (02) రిజర్వు కేటగిరి గీతకులాల బార్లు మొత్తం (20) బార్ల కు గాను స్థానిక కలెక్టరేట్లో సోమవారం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి వారు (02) రిజర్వు కేటగిరి గీతకులాల బార్ల ను లాటరీ ద్వారా జంగారేడ్డిగుడెం నగర పంచాయతి లోని బార్ ను గౌడ కులానికి మరియూ ఏలూరు మునిసిపాలిటి లోని బార్ సెట్టిబలిజ కులానికి కేటాయించారు. ఈ లాటరీ నందు జిల్లా మధ్య నిషేధ మరియు అబ్కారీ అధికారి ఏ.అవులయ్య,సి.ఐ ధనరాజ్ మరియు గౌడ, సెట్టిబలిజ కులానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు.

