NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్యాస్ సిలిండర్ పేలుడు బాధితురాలిని పరామర్శించిన ఆలూరు ఎమ్మెల్యే

1 min read

కదిరమ్మ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే.. మెరుగైన వైద్యం అందించాలని సూచన

బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా

ఆలూరు న్యూస్ నేడు: గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో గాయపడి కర్నూలులోని అమీలియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిప్పగిరి గ్రామానికి చెందిన పిల్లెలి కదిరమ్మను ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, తన సోదరుడు బుసినే శ్రీరాములుతో కలిసి బుధవారం పరామర్శించారు.కొన్ని రోజుల క్రితం జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో గాయపడిన కదిరమ్మ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వెళ్లిన ఎమ్మెల్యే విరుపాక్షి, ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి అందిస్తున్న చికిత్స వివరాలను తెలుసుకుని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.కదిరమ్మకు మెరుగైన వైద్యం అందించి, ఆమె ఆరోగ్యం త్వరగా కుదుటపడేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులకు సూచించారు. ప్రమాదంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబానికి అండగా ఉంటూ, ఆపద సమయంలో పరామర్శించి ధైర్యం చెప్పడం ద్వారా మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, ఆయన సోదరుడు బుసినే శ్రీరాములు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *