NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా

1 min read

ఇద్దరు లబ్ధిదారులకు రూ.4 లక్షల బీమా పరిహారం చెక్కుల పంపిణీ

కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్

కర్నూలు, న్యూస్​ నేడు:  కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) పథకాలు సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని కర్నూలు జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ పి. మోహన్ పేర్కొన్నారు.ఇండియన్ బ్యాంక్ మైక్రోసైట్ బ్రాంచ్ మేనేజర్ బి. శృతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో, బీమా పథకాల కింద అర్హులైన ఇద్దరు లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.4 లక్షల బీమా పరిహారం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో DRDA పీడీ శ్రీధర్ రావు, ఇండియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచి చీఫ్ మేనేజర్ అశోక్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుల వివరాలు:

1. ఖాజా బాషా (భర్త): బుధవారపేటకు చెందిన దివంగత షభానా బీమా పరిహారంగా రూ.2 లక్షల చెక్కును అందుకున్నారు.

2. అరవింద్ (కుమారుడు): దిన్నెదేవరపాడుకు చెందిన దివంగత మరియమ్మ బీమా పరిహారంగా రూ.2 లక్షల చెక్కును అందుకున్నారు.ఈ సందర్భంగా ఎల్డీఎం పి. మోహన్ మాట్లాడుతూ, అనుకోని పరిస్థితుల్లో కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలకు బీమా పరిహారం ఆర్థికంగా అండగా నిలుస్తుందని తెలిపారు. అతి తక్కువ వార్షిక ప్రీమియంతో అందుబాటులో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద బీమా చేసిన వ్యక్తి మరణించినప్పుడు, పథకం నిబంధనలకు లోబడి రూ.2 లక్షల బీమా పరిహారం లభిస్తుందని వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద ప్రమాదవశాత్తు మరణం లేదా పూర్తి శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు రూ.2 లక్షలు, పాక్షిక శాశ్వత వైకల్యానికి రూ.1 లక్ష వరకు బీమా ప్రయోజనం లభిస్తుందని తెలిపారు. ప్రజల్లో బీమా పథకాలపై అవగాహన పెంపొందించి, మరింత మందిని ఈ పథకాల పరిధిలోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా, అర్హులైన స్వయం సహాయక సంఘాలు ఉన్న మహిళలు, మరియు ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలలో చేరాలని డీఆర్​డీఏ    పీడీ శ్రీధర్ రావు  తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *