NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోట్ల

1 min read

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం

ప్యాపిలి న్యూస్ నేడు: దసరా నవరాత్రుల సందర్భంగా ప్యాపిలి పట్టణంలోని అమ్మవారిశాల ఆలయంలో డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రాజా మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆర్యవైశ్య సంఘం తరఫున శాలువాలు కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు లక్కసాగరం లక్ష్మిరెడ్డి, ఎద్దులదొడ్డి ప్రభాకర్, డోన్ మార్కెట్ యార్డు చైర్మన్ రాజా రేణుక, ఖాజా ఫీర్, రాజా నారాయణమూర్తి, బత్తుల రామేష్ రెడ్డి, గడ్డం అంకిరెడ్డి, ప్రసాద్ రెడ్డి, మండల కన్వీనర్ సుదర్శన్, పట్టణ కన్వీనర్ కొంగనపల్లి, జనరల్ సెక్రటరీ నడిగడ్డ నాగేంద్ర, టీడీపీ నాయకులు సుధాకర్ గుప్తా, మధుసూధన్ గుప్తా, రాజా యిసికేల మురళి కృష్ణ,రవి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *