NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కల్నల్ సంతోష్‌బాబుకు మహావీరచక్ర పురస్కారం

1 min read


పల్లెవెలుగు వెబ్: అమర జవాన్ కల్నల్ సంతోష్ బాబును మహావీరచక్ర పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం కల్నల్ మరణానంతరం ఈ అవార్డును ప్రకటించింది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా కల్నల్ సంతోష్ కుమార్ భార్య సంతోషి, తల్లి అవార్డును అందుకున్నారు. కాగా, ఆపరేషన్ స్నో లియోపార్డ్‌లో భాగంగా 16 బీహార్ రెజిమెంట్‌కు నాయకత్వం వహిస్తున్న కల్నల్ సంతోష్ బాబు గల్వాన్ లోయలో చైనా సైనికులతో పోరాడి వీర మరణం పొందాడు. అలాగే నాయబ్ సుబేదార్ నుదురాం సోరెన్, హవల్దార్ కె. పళని, నాయక్ దీపక్ సింగ్, సిపాయ్ గుర్తేజ్ సింగ్‌లకు వీరచక్ర అవార్డు వరించాయి.

About Author