పదవులు ముగిసినా ప్రజలతో నాయకుల అనుబంధం ఎప్పటికీ కొనసాగాలి
1 min read
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ స్పష్టం
న్యూస్ నేడు, పత్తికొండ: మండల పరిషత్ పాలకవర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా ఈరోజు ఉదయం వెల్దుర్తి పట్టణం వైయస్సార్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మాజీ జడ్పీటీసీ సుంకన్న,మాజీ ఎంపీపీ లక్ష్మీదేవమ్మ, ఎంపీటీసీలకు, ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథిగా హాజరైనమాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ..
పదవులు ముగిసినా ప్రజలతో నాయకుల అనుబంధం ఎప్పటికీ కొనసాగాలి అని
పదవులు మారినా.. ప్రజాసేవే నాయకులకు నిజమైన గుర్తింపు అని అన్నారు.అందరి సహకారంతో మొదటి రెండున్నర సంవత్సరాలు మాజీ ఎంపీపీ బొమ్మన సరళ, తర్వాత రెండున్నర సంవత్సరాలు మాజీ లక్ష్మీదేవమ్మ గారు బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంతో పాటు మండల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మనమందరం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని,ప్రజల కోసం పనిచేసిన నాయకుల సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, పదవులు ముగిసినా ప్రజలతో ఉన్న అనుబంధం కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రవి రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి షమీర్ కుమార్ రెడ్డి, ఆర్టిఏ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తూరు వెంకటేశ్వర్ రెడ్డి, పత్తికొండ నియోజకవర్గం పంచాయతీ రాజ్, యువజన విభాగం అధ్యక్షులు,జిల్లా కమిటీ రైతు సంఘం నాయకులు, మండల కమిటీ నాయకులు, మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు,మాజీ సర్పంచులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


