సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు ఆటపాటలతో నిరసన
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం: మండల కేంద్రమైన పాణ్యం లో, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మె సోమవారానికి 21వ రోజు కొనసాగించారు, సమ్మె సందర్భంగా దీక్ష శిబిరంలో నే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేసి ఆటపాటలతో ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో నిరసన తెలిపారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ముఖ్యఅతిథిగా సిఐటియు మండల కార్యదర్శి కె భాస్కర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ , అంగన్వాడీలు 21 రోజులుగా సమ్మె చేస్తున్న సమస్యలపై పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ అంగన్వాడీల సమస్యలు పట్టించుకోకపోవడం దుర్మార్గ చర్య అన్నారు, అంగన్వాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీలకు. గ్రాడ్యుటి తోపాటు వేతనం పెంచాలని అంగన్వాడి వర్కర్ చనిపోయిన వారి ఇంటిలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వాలని..లేనిపక్షంలో పిల్లలు, లబ్ధిదారులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో. సిఐటియు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మండల నాయకురాలు వెంకటమ్మ .మాబునిస. శ్యామల. మరియమ్మ.హైమావతి సూర్య ప్రభావతి అనసూయ.లక్ష్మీదేవి. ప్రభావతి, శివమ్మ వెంకటమ్మ .భారతి విద్యార్థి సంఘం నాయకులు బత్తిన ప్రతాప్ తదితరులు మండలంలోని అంగన్వాడీలు ఆయాలు పాల్గొన్నారు.