అంజుమాన్ ఫీజుల్ ఇస్లాం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం
1 min read
మెయిన్ బజార్ గొలుసులపంజా లో కార్యక్రమం
పెద్ద ఎత్తున విచ్చేసిన ముస్లిం సంఘాల నాయకులు, సోదరులు
ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసిన అధ్యక్ష, కార్యదర్శు మరియు సంఘ సభ్యులు
మా పదవీకాలంలో కుల మతాల కతీతంగా మరియు ముస్లిం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అస్సలాము అలైకుమ్ వ రహమతుల్లాహి వ బర్కాతుహు ఏలూరు మెయిన్ బజార్ గొలుసుల పంజా హజరత్ మౌలా అలి ముష్కిల్ కుషా ఆస్థాన లో శుక్రవారం సాయంత్రo ఏలూరు అంజుమన్ మహా ఫీజుల్ ఇస్లాం నూతన గా ఏర్పడిన కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ మరియు ఉన్నత హోదా కలిగినందుకు వారికి సన్మానం ఏర్పాటు చేశారు. అంజుమన్ ప్రెసిడెంట్ జనాబ్ షేక్ జబీఉల్లా సెక్రటరీ జనాబ్ అహమదుల్లా షరీఫ్ ట్రెజరర్ జనాబ్ షేక్ సిరాజ్ బాషా జనాబ్ రాజా అహ్మద్ అంజుమన్ వ్యవహారాల అధ్యక్షులు జనాబ్ షేక్ మస్తాన్, అంజుమన్ నాయకులు జనాబ్ ఇలియాస్ పాషా అంజుమన్ నాయకులు జనాబ్ రియాజ్ అలీ ఖాన్ అంజుమన్ నాయకులు వీరికి సన్మానం విజయవంతంగా జరిగినది ఈ కార్యక్రమంలో గొలుసులు పంజా ముజావర్లు ఎండి వజీర్ ఆలి, ఎండి గాలబ్ అలి, జనాబ్ అబ్బు భాయ్, జనాబ్ జానీ భాయ్, జనాబ్ రజాక్ బాయ్ మరియు డాక్టర్ షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ) వీరి అందరి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు మాకు ఇంతటి ఘన సత్కారం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే మా పదవీకాలంలో కులమతాలకతీతంగా మరియు ముస్లిం సోదర సోదరీమణుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.