PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎమ్మిగనూరు.. టిడిపి అభ్యర్థిగా డా బి వి జయనాగేశ్వర రెడ్డినే ప్రకటించాలి  

1 min read

ఎమ్మిగనూరు మండల టిడిపి అధ్యక్షులు మల్లికార్జున

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలోని టిడిపి పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల టిడిపి అధ్యక్షులు మల్లికార్జున  ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు మండల టిడిపి కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ….. రాబోవు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి టిడిపి అభ్యర్థిగా గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డి గారినే ప్రకటించాలని కోరారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డి గారిని తప్ప వేరే ఎవ్వరికి కేటాయించిన ఎమ్మిగనూరు మండలంలోని అన్ని గ్రామాలలో గల టిడిపి గ్రామ కమిటీలు, బూత్ ఇంచార్జిలు, మండల కమిటీ సభ్యులు అందరు కూడా టిడిపి పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని అధిష్టానాన్ని కోరారు. ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని అధికారం ఉన్నా, లేకున్నా బి. వి కుటుంబం అనునిత్యం ప్రజలలో ఉంటూ కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారిని అన్ని విధాలా అండగా ఉంటూ వస్తున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కొంతమంది వైసిపి పార్టీ నాయకులతో కుమ్మక్కు అయి ఎమ్మిగనూరు సీటును బిసి లకు కేటాయించాలని సదస్సులు సమావేశాలు నిర్వహిస్తున్నారని, మరికొందరు ఏకంగా ఎమ్మిగనూరు టిడిపి సీటును అధినేత తనకే కేటాయించారని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ తప్పుడు ప్రచారాలు చేసుకుంటున్నారని ఇది మంచి పద్దతి కాదని వాపోయారు. ఇలా తప్పుడు ప్రచారం చేసుకుని తిరుగుతున్నా వారికి కనీసం టిడిపి సభ్యత్వం అయినా ఉందా ? అని ప్రశ్నించారు. టిడిపి పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరని అలాంటిది కనీసం సభ్యత్వం కూడా లేని వ్యక్తి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న ఇటు కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు గాని, రాష్ట్ర టిడిపి అధ్యక్షులు గాని, జాతీయ టిడిపి అధ్యక్షులు గాని ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈరోజు ఎమ్మిగనూరులో బిసి లు ఎక్కువ ఉన్నారని కావున బిసిలనే టిడిపి అభ్యర్థులుగా ప్రకటించాలని కోరుతున్న బిసి నాయకులు గతంలో కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా 2 సార్లు, ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా బిసిలకే అవకాశం ఇచ్చిన ఆరోజు ఎందుకు గెలుపించుకోలేకపోయారు అని సూటిగా ప్రశ్నించారు. ఆరోజు వాళ్ళు బిసి లు అన్న విషయం మరిచారా ? అని పేర్కొన్నారు.  అత్తా అల్లుళ్ళ డ్రామాలు ఆపండి. వైసిపి పెటియం బ్యాచ్   ఐ. పి. ఏ. సి. కె ఉచ్చులో పడి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో టిడిపి క్యాడర్ ను గందరగోళానికి గురి చేయకుండా ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్థిగా బివి కె  కేటాయించాలని కోరినారు. లేని యెడల మూకుమ్మడి రాజీనామాకు సిద్ధం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు మండల కమిటీ సభ్యులు రంగన్న, దేవదాసు, హనుమంతు,  వీరనాగప్ప, లోకా రెడ్డి, రాఘవేంద్ర, నాగరాజు, మోకాసి రాఘవేంద్ర, విజయభాస్కర్ గౌడ్,  లక్ష్మీనారాయణ,  ఎలకన్నా, ఈరన్న, ఖాజా, అయ్యలప్ప, సోమేశ్వర రెడ్డి, డీలర్ ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

About Author