ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ కర్నూలు జిల్లా లో విస్తృత పర్యటనలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జాతీయ ఆహార భద్రత చట్టం అమలుతీరును పర్యవేక్షించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీ విజయ ప్రతాపరెడ్డి గత రెండు రోజులుగా కర్నూలు జిల్లా లో విస్తృత పర్యటనలు గావించడం జరిగింది..ఈ పర్యటనలో భాగంగా ఆయన గత రెండు రోజులుగా మంత్రాలయం, దేవనకొండ, పత్తికొండ, ఆలూరు మండలాలలో అంగన్వాడీ సెంటర్లు,మధ్యాహ్న భోజనం పథకము వివిధ స్కూళ్లలో జరుగుతున్న అమలు తీరు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, కేజీబీవీ విద్యాలయాలు, ఎం.ఎల్.ఎస్ పాయింట్లు, రేషన్ షాపులు మొదలగు ఎస్టాబ్లిష్మెంట్స్ పర్యటించడం జరిగినది.మంత్రాలయం లో జిల్లా పరిషత్ హై స్కూల్లో సాంబారు పల్చగా నీళ్లుగా ఉండటం గమనించిన చైర్మన్ వంట మనుషులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగినది.. హై స్కూల్ హెడ్మాస్టరు మరియు విద్యాశాఖ అధికారులను కూడా మందలించడం జరిగినది..సాంబారులో ఒక విద్యార్థికి 30 గ్రాముల చొప్పున కందిపప్పు వాడవలసి ఉండగా, వంట మనుషులు కేవలం 6 కేజీల కందిపప్పుతో విద్యార్థులకు పల్చటి పప్పుచారు వండటం చూసి, ఆయన వంట ఏజెన్సీని తొలగించవలసినదిగా అధికారులను ఆదేశించడం జరిగినది. ఈ పర్యటనలలో జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా మేనేజరు పౌరసరఫరాల సంస్థ, సిఎస్డిటీలు, సంబంధిత తహసీల్దారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు, సాంఘిక సంక్షేమ హాస్టల్ల అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు, మహిళా శిశు సంక్షేమ అధికారులు, పాల్గొనడం జరిగింది.
