ఏటీఎం దొంగలు అరెస్టు….
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: ఏటీఎం దొంగతనానికి ప్రయత్నం చేసిన 4 గురు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్ష .ఒక్కొక్కరికి రూ. 14 వేల జరిమానా.మంగళవారం తీర్పు వెలువరించిన… జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, కర్నూలుగుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థ బలోపేతం .నెల న్నర రోజులలోనే ముద్దాయిలకు శిక్షలు పడే విధంగా కృషి చేసిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించిన… కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్.కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ పర్యవేక్షణలో కర్నూలు పోలీసులు ముద్దాయిలకు కఠిన శిక్షల కై గట్టి చర్యలు చేపట్టారు.24.02.2025 వ తేదీన రాత్రి 1.00 గంటల సమయములో చిన్నటేకూర్ గ్రామములొ యన్.హెచ్ 44 సర్వీస్ రోడ్డు ప్రక్కన ఉన్న బిఓబి ఏటిఎం సెంటర్ పై దొంగలు షటర్ ను ఒక టోయింగ్ వాహనముతో బలవంతముగా లాగి, లోపల ఉన్న ఏటిఎం మిషన్ కు తాళ్ళు కట్టి బయటకు లాక్కొని పోవడానికి ప్రయత్నిస్తుండగా గ్రామ యువకులు గమనించి పోలీసు వారికి సమాచారము అందించారు. పోలీసులు , గ్రామ యువకులు సంఘటన స్ధలానికి రావడంతో నిందితులు ఏటిఎం మిషన్ రోడ్డు ప్రక్కన వదలి టోయింగ్ వాహనముతో అక్కడ నుండి పారిపోయారు. బిఓబి బ్యాంకు మేనేజర్ ఫిర్యాదు పైన ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం. 23/2025 U/s 309 (5), 324(5) r/w 62 BNS Sec 49 BNS దోపిడి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగింది. నెలన్నర రోజులలోనే ముద్దాయిలకు శిక్ష పడేవిధంగా కృషి చేసిన స్పెషల్ ఏ.పి.పి అనిల్ కుమార్ , దర్యాప్తు అధికారులు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ , కర్నూలు రూరల్ సిఐ చంద్రబాబు నాయుడు , ఉలిందకొండ ఎస్సై ధనుంజయ , కోర్టు కానిస్టేబుల్ మహేష్, శేఖర్ లను కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ అభినందించారు.