NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జిల్లాలో  కురువల పై దాడులను అరికట్టాలి

1 min read

ఉమ్మడి కర్నూలు జిల్లా కురువ సంఘం  డిమాండ్

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూలు నగరం లోని పెద్దపాడు రోడ్ లోని శ్రీ . బీరప్ప స్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా కురువ సంఘం నాయకులు మట్లాడారు.  గత రెండు సంవత్సరాల నుంచి జిల్లా లో కురువల పై దాడులు చేస్తున్నారని కోడుమూరు నియోజకవర్గంలోని పొన్నకల్లు గ్రామంలో మైనర్ బాలికను పెళ్లి చేసుకున్నందుకు ఫోక్సో కేసు నమోదు అయినందుకు కురువలపై దాడులు చేయడంతో భయందోళనలతో కురువలు జీవిస్తున్నారని అదే విధంగా ఎమ్మిగనూరులో కురువ నగేష్ అనే వ్యక్తి ని అప్పు ఇవ్వలేదని  దాడి చేశారని కురువ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి తెలిపారు. కొన్ని రోజుల క్రితం కర్నూలు శ్రీరామ నగర్ లో కొందరు కురువ రంగయ్య పై దాడి చేశారన్నారు. కాంట్రాక్టర్ గా రంగయ్య కు 45 సంవత్సరాల అనుభవం ఉందని అలాంటి వ్యక్తి పై డబ్బులు అడిగితే  ఇవ్వనందున దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్. పి కి ఫిర్యాదు చేసిన ఇంతవరకు కేసు నమోదు చేయలేదన్నారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే కురువ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో రంగస్వామి, కాంట్రాక్టర్ రంగయ్య,  పెద్దపాడు ధనుంజయ కోశాధికారి , కే.సీ. నాగన్న, నగర సంఘం కార్యదర్శి బి.రామకృష్ణ, కోశాధికారి కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *