కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలను వివరించిన టీడీపీ సీనియర్ నాయకులు
1 min read
బూత్ నంబర్ 43లో “ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు” కార్యక్రమం
హోళగుంద న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గంలో హోళగుంద మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఇంటింటికి కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలు” కార్యక్రమం హొళగుంద మండలంలోని బుడగజంగాల కాలనీ బూత్ నంబర్ 43లో ఉత్సాహంగా కొనసాగింది. ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి ఆదేశాల మేరకు టీడీపీ సీనియర్ నాయకులు బుడగజంగాల రామాంజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రామాంజీ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బుడగజంగాల కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండేళ్లలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా అర్హులైన పేదలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు.సామాజిక భద్రతలో భాగంగా రూ.4,000 పింఛన్, విద్యార్థుల కోసం తల్లికి వందనం, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, పేద ప్రజలకు తక్కువ ధరకే భోజనం అందించే అన్న క్యాంటీన్లు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, విద్యా రంగంలో చేపడుతున్న చర్యలు, వైద్య సేవల మెరుగుదల తదితర అంశాలను ప్రజలకు వివరించారు.కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతోందని రామాంజీ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేయడం కోసం ఇంటింటికీ వెళ్లి వివరిస్తున్నామని తెలిపారు.అదేవిధంగా కాలనీ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, పారిశుధ్యం, విద్యుత్, పింఛన్లు, ఇతర స్థానిక సమస్యలపై ప్రజల నుంచి వివరాలు సేకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తామని రామాంజీ భరోసా ఇచ్చారు.ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారం కోసం కృషి చేయడమే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల లక్ష్యమని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో ప్రతి కార్యకర్త చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవిందు, చిన్న, కొండయ్య తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. కార్యక్రమానికి కాలనీ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.



