NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డ్రగ్స్​ పై అవగాహన..

1 min read

కర్నూలు, న్యూస నేడు: జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాది కార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి,   జూన్ 26 న  అంతర్జాతీయ మదకద్రవ్యా దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ రోజు 25-06-1026 న డాక్టర్ కాలనీ నందు గల గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఫర్ మెన్  నందు అంతర్జాతీయ మాదక ద్రవ్య దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి  (మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు మాదక ద్రవ్యాల నిర్మూలన బాధితులకు న్యాయ సేవలు) పథకం, 2015 గురించి వివరించారు.  అందరూ ఆలోచించి ఇతరులను ఆలోచింపచేసి మీవంతు సహాయ సహకారాలను అందిస్తూ మాదకద్రవ్యాల వినియోగాన్ని నిర్మూలించాలని, తద్వారా మనదేశ సమగ్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. డ్రగ్స్… మాదక ద్రవ్యాలు… ఈ మాట విననివాళ్లు లేదా ఈ పేరు తెలియనివాళ్లు అరుదు తమాషాగా మొదలై అది లేకుంటే బ్రతకలేమనేంత బానిసలుగామార్చే శక్తి ఈ మహమ్మారి డ్రగ్స్ కు కలదని తెలిపారు. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ ఇందిరా శాంతి మాట్లాడుతూ వివిధ వయసులవారు, రకరకాల స్థాయిల్లో ఉన్నవారు ఈ మత్తుపదార్ధాల బారినపడి అన్ని రకాలుగా పతనమౌతూ తమ కుటుంబ సభ్యులకు మనోవేదన మిగులుస్తున్నారన్నారు.  ఈగల్ టీమ్ ఆఫీసర్ ఏలీషా  మాట్లాడుతూ ఈ డ్రగ్స్ మాఫియాలు విద్యాసంస్థల్ని, వాటిలోని విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకొని విచ్చలవిడిగా చెలరేగిపోతున్నయన్నారు . లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ  డ్రగ్స్ దుర్వినియోగం మరియు అక్రమ రవాణా గురించి మరియు మాదకద్రవ్యాల వాడకం వలన వచ్చే దుష్పరిణామాల  గురుంచి వివరించి దాని వలన వచ్చే ప్రమాదాల గురుంచి అవగాహనా కల్పించారు.సీనియర్ సిటిజెన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ రెయిస్ ఫాతిమా మాదకద్రవ్యాలను వాడటం వలన వారు తనను తానూ అదుపు తప్పి  ఆరోగ్యాన్ని చెడకోట్టుకొని జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు . అనంతరం డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వీడియో ప్లే చేసి విద్యార్థులకు సవివరంగా వివరించారు. డ్రగ్స్ వ్యతిరేక గోడపత్రికలను జడ్జి  చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం లీగల్ ఎయిడ్ మెంబర్  డాక్టర్ రాయపాటి శ్రీనివాసరావు   అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవం పై విద్యార్థులతో ప్రతిజ్ఞ  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఫర్ మెన్ ప్రిన్సిపల్ ఇందిరా శాంతి, వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, ఈగల్ టీమ్ ఆఫీసర్ ఏలీషా, డ్రగ్స్ అబ్యూస్ ఎన్జీవో వేణుగోపాల్, స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శివ శంకర్, లెక్చరర్ లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *