పండ్ల,పూల మొక్కలపై..ప్రజలకు అవగాహన
1 min read
ఓర్వకల్లు ఎంపీడీఓ శ్రీనివాసులు..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : పండ్లు మరియు పూల మొక్కలను గ్రామాల్లో పెంచుతూ ప్రజలు అభివృద్ధి చెందాలని ఓర్వకల్లు ఎంపీడీఓ శ్రీనివాసులు మరియు ఉపాధి హామీ పథకం ఏపీఓ మద్దేశ్వరమ్మ అన్నారు.కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గుడుంబాయి తాండ,కాల్వ గ్రామాల్లో ఏపీవో ఆధ్వర్యంలో మంగళవారం ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఉపాధి పథకం కింద ఉద్యాన పంటలు పండ్లు మరియు పూల మొక్కలపై ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.ఆసక్తిగల రైతులను గుర్తించుటకు సమావేశం ఏర్పాటు చేశామని కుటుంబ సభ్యులందరికీ కలిపి 5 ఎకరాల లోపు విస్తీర్ణం కలిగిన భూమి కలిగి ఉండి,జాబ్ కార్డు కలిగి ఉన్న కుటుంబాలు ఈ యొక్క ఉద్యాన పంటల పెంపకం సాగు చేయుటకు అర్హులు అవుతారని ఉద్యాన శాఖ తరపున 13 రకాల పండ్ల మొక్కలు మరియు మల్లె,గులాబీ,మునగా లాంటి పూల తోటల నిర్వహణకు ఎవరైనా రైతులు ఆసక్తి ఉన్నట్లయితే వారి వివరాలను మీ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ కు గానీ ఉపాధి హామీ కార్యాలయంలో అందజేసినట్లయితే వీటి పనుల మంజూరు కొరకు జిల్లా అధికారులకు పంపిస్తామని,మంజూరు అయిన తర్వాత మీ పనులను ప్రారంభించు కోవచ్చని ఎంపీడీవో ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మురళీ,నరేష్ మరియు టెక్నికల్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.