ఘనంగా బసవ జయంతి వేడుకలు..
1 min read
బసవేశ్వర చిత్ర పటానికి ఊరేగింపు
మంత్రాలయం న్యూస్ నేడు : నియోజకవర్గం కేంద్రమైన మంత్రాలయంలో బసవ జయంతి వేడుకలు జంగమ మహేశ్వర్లు , వీరశైవ లింగాయితుల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాత ఊరిలో కొలువైన రామలింగేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున నుండి పంచామృతాభిషేకం, మహా రుద్రాభిషేకం నిర్వహించి మహా మంగళహారతులు ఇచ్చారు. జంగమ మహేశ్వరులు, వీరశైవ లింగాయతుల ఆరాధ్య దైవమైన విశ్వ గురువు బసవేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రత్యేకంగా తయారుచేసిన వాహనంలో ఉంచి మంగళ హారతులు ఇచ్చారు .అనంతరం మహిళలు, చిన్నారులు కళసములతో రాగా, మంగళ వాయిద్యాలు , డప్పు వాయిద్యాలు నడుమ యువకులు నంది కోలాటాలతో పురవీధుల గుండా రాఘవేంద్ర సర్కిల్ మీదుగా పురవీధుల గుండా వైభవంగా ఊరేగిస్తూ రామలింగేశ్వర స్వామి ఆలయం చేరుకున్నారు .అనంతరం రామలింగేశ్వర స్వామికి మహా మంగళ హారతులు సమర్పించారు. అనంతరం భక్తులకి నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో మూలింటి చంద్రశేఖర్ గౌడ్, ఆడిటర్ శంకర స్వామి , పాండు , గాజుల పరమేష్ గౌడ్, ఎల్ మల్లికార్జున గౌడ్ వీరేష్ ఓం నమశివాయ, ఉపసర్పంచ్ హోటల్ పరమేష్ స్వామి, ఎల్లాలింగస్వామి, టెంకాయల బసవరాజు గౌడు, బిచ్చలి రమేష్ గౌడు , జంగమ మహేశ్వరులు వీర శైవ లింగాయితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై శివాంజల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
