కర్నూలు నగరంలో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని బంగారు పేట శ్రీరామ థియేటర్ వద్ద గల సర్కిల్ ను కర్నూల్ నగర కార్పొరేషన్ వారు శ్రీ బసవ సర్కిల్ గా నామకరణం చేసినందున శ్రీ బసవ సర్కిల్ లో బసవ జయంతి సందర్భంగా నగరంలోని వీరశైవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వీరశైవులు మహాత్మా బసవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరశైవ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా కర్నూలు నగరంలో మహాత్మా బసవేశ్వర సర్కిల్ కావాలని పోరాడుతున్నామని.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సహకారంతో తమ కల నెరవేరిందన్నారు. దీంతో వీరశైవ సమాజం మంత్రి టీజీ భరత్ కి ఎంతో రుణపడి ఉంటుందని తెలియజేశారు. అలాగే ఈ శ్రీ బసవ సర్కిల్ ను అభివృద్ధి పరచడంలో, బసవేశ్వర విగ్రహం స్థాపనలో కూడా ప్రభుత్వ సహకారం కావాలని మంత్రిని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరశైవ ఐక్యవేదిక నాయకులు ఏజీ మల్లికార్జునప్ప, ఎస్వి శివరాజు, జి చంద్రశేఖరప్ప, శెట్టి వీరశేఖరప్ప, జంగం విశ్వేశ్వరయ్య, జె. మల్లికార్జునయ్య, వీరశైవాగమ అపురోహితులు పీఎం యాగంట య్యా స్వామి,జీఎం శ్రీకాంత్ స్వామి ,సగరం నాగరాజు, సి. మల్లయ్య, జి భూపీనాథ్, ఎల్ వెంకటేశ్వర్లు, సి యాగంటిశ్వరప్ప, జె కాశీ విశ్వనాథ్ ,యం. శివ లింగయ్య ,యాసం నవీన్ కుమార్, దామోదర్, జె. వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.