బెత్తంపట్టని బడిపంతులు కాజా.శేషుబాబు మాస్టారు
1 min read
ఘనంగా సన్మానించిన పలువురు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,మిత్రులు శ్రేయోభిలాషులు,కుటుంబ సభ్యులు
గత 42 రెండు సంవత్సరాలుగా సేవలు, ఉత్తమ ఉపాధ్యాయునిగా ఉన్నతాధికారులచే ప్రశంసలు
కన్నుల పండుగగా కలకలాడిన సన్మాన కార్యక్రమం
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గత 42 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులను ఉత్తమ పౌలుగా తీర్చి దిద్దిన కాజా శేషు బాబు ఎంఏ, ఎంఈడి, పద్మ దంపతులు ఆయురారోగ్యాలతో ఉండాలని పలువురు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఉపాధ్యాయులు ఆశీర్వదిస్తూ ఘనంగా సత్కరించారు. ఈయన దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం గోవింద వారి గూడెం ఎలిమెట్రీ స్కూల్ నుండి పదవి విరమణ పొందారు. కాజా శేష, పద్మ జీవితం నిండు నేరేడ్లు కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ మనుమలు, మనమరాడ్రులతో శేష జీవితం గడపాలని పలువురు ఆకాంక్షించారు. ఆదివారం స్థానిక అశోక్ నగర్ అంబికా ఫంక్షన్ ఏ/సి ఫంక్షన్ లో ఏర్పాటు చేసిన పదవి విరమణ సభలో పలువురు ఉపాధ్యాయులు మరియు స్నేహితులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఆయన సేవలను గుర్తు చేస్తూ. సున్నిత మనస్తత్వం గల ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల బెత్తం పట్టని బడిపంతులు మరియు ఉన్నతాధికారులచే ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందిన వారిగాఅభివర్ణిస్తూ కొనియాడారు. ఆయన పదవి విరమణ సభకు పెద్ద ఎత్తున ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల నుండి ఎంతోమంది చరవాణిల ద్వారా పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు స్వయంగా విచ్చేసి పూల బొకేలు అందించి, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె స్వాతి అల్లుడు అశోక్, చిన్న కుమార్తె శ్వేత అల్లుడు హరి, కార్యక్రమనంతటిని పర్యవేక్షిస్తూ విచ్చేసిన అతిధులకు సకల మర్యాదలు సమకూర్చి. ప్రత్యేక ఆహ్వానం పలికారు. విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.