భవ్య హెల్త్ సర్వీసెస్ 104 ద్వారా గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
1 min read

అమరావతి రీజనల్ మేనేజర్ డాక్టర్:జి.హిమజ
క్యాంపులో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :రాష్ట్రంలో భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న 104 గ్రామాల్లో అనేక రకాలైన వైద్య సేవలను అందిస్తుందని అమరావతి రీజనల్ మేనేజర్ డాక్టర్: జి.హిమజ పేర్కొన్నారు. బుధవారం పెదవేగి మండలం కొప్పులవారి గూడెం పంచాయతీ పరిధిలోని నాగన్న గూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 104 ద్వారా పేద ప్రజలకు అనేక రకాలైన వైద్య సేవలను అందిస్తున్నామని ఆమె అన్నారు. అలాగే గ్రామాలలో వైద్య సేవలు అందుతున్న విధివిధానాలను పరిశీలించి, ల్యాబ్ టెక్నీషియన్ ను కూడా నియమించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. బిపి,షుగర్, రక్త పరీక్షలు తదితర వైద్య సేవలను 104 ద్వారా ప్రజల వద్దకే వచ్చి పరీక్షలు నిర్వహించడం, ఉచితంగా మందులను అందించడం ఈ క్యాంపు యొక్క ప్రధాన ఉద్దేశమని ఆమె తెలిపారు. క్యాంపులో అనేకమందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా మేనేజర్ విజయ్, జిల్లా ఇన్చార్జి కార్తీక్, వైద్య సిబ్బంది మరియు104 సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు.

