నూతన చర్చిని ప్రారంభించిన బిషప్ జ్వాన్నేష్..
1 min readఅధిక సంఖ్యలో హాజరైన విశ్వాసులు
దివ్య బలిపూజ సమర్పించిన బిషప్ గోరంట్ల జ్వాన్నేష్..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సీఎస్ఐ పాలెంలో నందికొట్కూరు వేలాంగణి మాత చర్చి విచారణ గురువులు ఫాదర్ కేడీ జోసఫ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆర్సీఎం దేవాలయాన్ని బుధవారం కర్నూలు మేత్రాసన కాపరి బిషప్ గోరంట్ల జ్వాన్నేష్ పూజల అనంతరం దేవాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ముందుగా బిషప్ గారికి ఫాదర్ కేడీ జోసెఫ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.ప్రత్యేక ప్రార్థనలతో మరియు దివ్య బలిపూజను బిషప్ సమర్పించారు.మనకు అన్ని విధాలుగా దేవుడు తోడుగా ఉన్నారని మనం ఏమి చేయాలన్నా కూడా దేవుని ఆశీస్సులు మనపై ఉంటేనే ఏదైనా సాధ్యమని అంతే కాకుండా ఇంతటి చక్కటి దేవాలయాన్ని మనం నిర్మించుకున్నామంటే దేవుని చిత్తం ప్రకారమే జరిగిందని మనకు తెలియకుండానే దేవుడు ఎన్నో మేలులను ప్రతిరోజూ మనకు చేస్తూ ఉన్నారని ఆ దేవునికి కృతజ్ఞతలు తెలుపాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అందుకే దేవుడిని మనం స్తుతించాలని అంటూ బిషప్ వాక్య పరిచర్య చేశారు. అనంతరం విశ్వాసులకు బిషప్ దివ్య సత్యప్రసాద అప్పమును అందజేశారు. చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా అలరించాయి. బిషప్ గారిని సంఘ పెద్దలు విశ్వాసులు విచారణ గురువులు ఘనంగా సత్కరించారు.సంఘ విశ్వాసులు మరియు బంధుమిత్రులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో జీవసుధ పాస్టరల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ బాలరాజు, కేడిఎస్ఎస్ డైరెక్టర్ ఫాదర్ సుధాకర్ వివిధ విచారణల గురువులు లహస్త్రయ,ఇన్నారెడ్డి,జార్జ్, మధుబాబు,బాల యేసు,రవి వివిధ గురువులు,సెయింట్ మేరీస్ పాఠశాల అధినేత కెన్నడి జోసెఫ్ దంపతులు మరియు అధిక సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు.