బిజెపి పాలన భేష్…
1 min read
బిజెపి ప్రభుత్వ ఏకాదశ వసంతాల వేడుకలు
గాంధీనగర్ ప్రెస్క్లబ్లో 11 మంది వేద బ్రాహ్మణులతో వేద పఠనం
రాజకీయ విశ్లేషకుడు తాతా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
విజయవాడ, న్యూస్ నేడు: బిజెపి ప్రభుత్వ పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏకాదశ వసంతోత్సవ వేడుకలు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ ఘనంగా నిర్వహించారు. బిజెపి నేతృతంలో దేశం అన్ని రంగాల్లో ఉన్నతమైన స్థానంలోకి వెళుతుందని, బిజెపి పాలన సుభిక్షంగా కొనసాగాలని కోరుతూ రాజకీయ విశ్లేషకులు తాతా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్లో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో 11 మంది వేద బ్రాహ్మణులచే వేద పఠనం, ఆశీర్వచనం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ దీర్ఘాయుష్షు కలిగి ఉండాలని, దేశాన్ని ముందుకు నడిపించాలని ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా తాతా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మోడీ నేతృత్వంలో దేశంలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. బిజెపి పార్టీ స్థాపించి 45 సంవత్సరాలు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కోట్లాదిమంది కార్యకర్తలని సొంతం చేసుకుందన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి దిశగా అడుగులేస్తుందని, ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే పార్టీ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ,తెలుగుదేశం, జనసేన కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ లో సూపరిపాలన అందిస్తున్నారన్నారు. మోడీ నాయకత్వంలో బీజేపీ 11 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 11 మంది వేద పండితులతో ఘనంగా పూజలు నిర్వహించామన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు సాగాలని గొప్ప గొప్ప పరిశ్రమలు రాష్ట్రానికి రావాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్లకు ఎటువంటి అరిష్టాలు కలగకుండా సకాలంలో ఆర్థిక వనరులు సమకూరాలని తెలిపారు.