7వ ఎంపీటీసీ అభ్యర్థిగా వాకిటి కవిత నామినేషన్ దాఖలు
1 min read
న్యూస్ నేడు, పత్తికొండ : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున పత్తికొండ పట్టణంలో 7వ ఎంపీటీసీ అభ్యర్థిగా వాకిటి కవిత శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో సిపిఐ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఐ అభ్యర్థులు ను గెలిపించాలని పి రామచంద్రయ్య అన్నారు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి కంకి కొడవలి గుర్తుకే ఓటు వేయండి అని నినాదాలు చేశారు 6వ వార్డు ఎంపీటీసీ అభ్యర్థిగా జి . నెట్టి కంటయ్య రెండవ సెట్టు నేడు నామినేషన్ దాఖలు చేశారు.


