ప్రజలకు మరింతగా బిఎస్ఎన్ఎల్ సేవలు..
1 min read
జనరల్ మేనేజర్ నారాయణస్వామి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ప్రజలకు మరింతగా బిఎస్ఎన్ఎల్ సేవలు విస్తృతం చేస్తున్నామని కర్నూలు రూరల్ డివిజన్ అసిస్టెంట్ మేనేజర్ జి.నారాయణస్వామి అన్నారు.మంగళవారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో కేజీ రహదారిపై బిఎస్ఎన్ఎల్ సేవల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ నెలను వినియోగదారుల సేవా మాసంగా భావించి ‘కనెక్టింగ్ విత్ కేర్ ‘నినాదంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని ప్రజలు వినియోగదారులు వినియోగించుకోవాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ను మరింత చేరువగా చేసే ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో కస్టమర్ సర్వీస్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆ క్యాంపుల ద్వారా ప్రజల నుండి వచ్చే సూచనలు,సలహాలు తీసుకుంటూ మరియు కస్టమర్ల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు అన్నారు.వినియోగదారులు సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు కానీ లేదా www. cfp.bsnl.co.in ద్వారా ఆన్లైన్లో తమ ఫిర్యాదులు చేయవచ్చని అన్నారు.బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ లో అద్భుతమైన స్పెషల్ డిస్కౌంట్ లను ప్రవేశపెట్టారు. ఫైబర్ బేసిక్ నియో 449 ప్లాన్ మరియు ఫైబర్ బేసిక్ 499 ప్లాన్ తీసుకున్న వారికి మొదటి నెలలో ఉచితంగా సర్వీసులను పొందిన తర్వాత మూడు నెలల వరకు 50 రూపాయలు మరియు 100 రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ పి. సుధీర్ బాబు,జెటిఓ బుజ్జయ్య,మార్కెటింగ్ సబ్ డివిజనల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు సిబ్బంది మరియు టీఐపీ ఇబ్రహీం, ఫ్రాంచైజీ మీనాక్షి, కమ్యూనికేషన్ రవికుమార్ పాల్గొన్నారు .