NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రశాంసా పత్రం..

1 min read

ప్రశాంసా పత్రాన్ని అందుకుంటున్న కానిస్టేబుల్ అనిల్ కుమార్

హొళగుంద న్యూస్ నేడు : మండలకేంద్రం హొళగుందస్థానిక పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అనిల్ కు మార్ కు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చేతుల మీదుగా ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రతి ఏడాది విధుల పట్ల ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే కానిస్టేబుల్ అనిల్ కుమార్ అందించిన సేవలు, తన విధులను గుర్తిస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఏఎస్పి, పత్తికొండ డిఎస్పి వెంకటరామయ్య చేతుల మీదుగా అవార్డును అందించడం జరిగింది. ఈ సందర్భంగా కాని స్టేబుల్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా పోలీసు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా విధులను మరింత అంకితభావంతో సేవలందిస్తానని అనిల్ కుమార్ తెలియజేశారు.

About Author